Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:08 AM

మనూరు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా బిరాధర్ దత్తు ఏకగ్రీవ ఎన్నిక

27-02-2026 204 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూరు మండలంలో సర్పంచ్ ఫోరం నూతన కమిటీని శుక్రవారం మండల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో పరస్పర చర్చలు,ఏకాభిప్రాయంతో ఫోరం అధ్యక్షులుగా దోసపల్లి సర్పంచ్ బిరాధర్ దత్తును,ఉపాధ్యక్షులుగా ఎంబడి సంగారెడ్డిని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బిరాధర్ దత్తు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తామని, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా ఫోరం వేదికగా పనిచేస్తామని చెప్పారు. సర్పంచుల హక్కుల పరిరక్షణ, గ్రామ నిధుల సమర్థ వినియోగం, పారదర్శక పరిపాలన కోసం అందరితో కలిసి ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు.ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాణపూర్ సర్పంచ్ ఎంబడి సంగారెడ్డి మాట్లాడుతూ, మండలంలోని అన్ని సర్పంచులను సమన్వయం చేస్తూ గ్రామాభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.సమావేశంలో పాల్గొన్న సర్పంచులు నూతన కమిటీపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఫోరం చురుకుగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

మనూరు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా బిరాధర్ దత్తు ఏకగ్రీవ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News