Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:20 AM

మనూర్‌లో బీరప్ప కామరాతి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

01-03-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజికవర్గంలోని మనూర్ మండల కేంద్రంలో ఐదు రోజులుగా ఘనంగా జరుగుతున్న బీరప్ప కామరాతి కళ్యాణం మహోత్సవం భక్తి, సంప్రదాయం, సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ వేడుకల్లో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్,పీసీసీ సభ్యుడు కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.మహోత్సవ సందర్భంలో వారు బీరప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్ల కురుమ సంఘం అధ్యక్షుడు మాలశెట్టి శాలువాతో సత్కరించబడ్డారు. సభలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిద్ధారెడ్డి, మండల స్థాయి నాయకుడు రఘువాచారి, నియోజికవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షుడు సాయిలు, కంగ్టి మండల యువ నాయకుడు కాలే రాజు, మాణిక్ ప్రభు, మోహన్ రెడ్డి, సతీష్, భూమగొండ, ప్రసాద్, కొండల్ రెడ్డి, చామకుల పాండు, సాయి చరణ్, మూఢ శ్రీను తదితరులు పాల్గొన్నారు.ఈ మహోత్సవం ప్రాంతీయ సంప్రదాయాల పరిరక్షణకు, భక్తి భావాల పెంపొందింపుకు, సామాజిక ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గ్రామీణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ ప్రజలందరినీ ఒక్కటిగా చేర్చే ఆధ్యాత్మిక ఉత్సవంగా ఈ వేడుక విశేషంగా ఆకట్టుకుంది.

Sthanikam

మనూర్‌లో బీరప్ప కామరాతి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News