Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:06 AM

మానూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

16-04-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండల పంచాయతీ కార్యదర్శుల ఫోరం నూతన కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. నారాయణఖేడ్ టీఎన్‌జీఓ యూనిట్ జనరల్ సెక్రటరీ మిస్కిన్ అధ్యక్షతన, తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ జిల్లా ఫోరం జనరల్ సెక్రటరీ జె.రాజు ఆధ్వర్యంలో, జిల్లా ఫోరం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బాలు, పబ్లిసిటీ సెక్రటరీ సుభాష్ మరియు పలువురు పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడింది. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జె.రాజు పర్యవేక్షణలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా నర్ముల సంతోష్, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీగా చి. సంతోష్, కోశాధికారిగా ఎం.సంగీత, జాయింట్ సెక్రటరీగా బి.కళావతి, స్పోర్ట్స్ సెక్రటరీగా నాందేవ్‌ను ఎన్నుకోగా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నరేష్ చారి, శ్రీను రాథోడ్, రాజ్ కుమార్, గణపతి ఎంపికయ్యారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి రఘుబాబు, ఎంపీడీవో చంద్రశేఖర్ చేతుల మీదుగా టీపీఎస్సీఎఫ్-2026 డైరీ మరియు టీపీఎస్‌డీఎఫ్ సంగారెడ్డి జిల్లా టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారం మరియు గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.

Sthanikam

మానూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శుల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News