Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 05:32 AM

మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
February 28, 2026 06:48 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మల్కాజిగిరిలో వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం తదితర సైన్స్ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది థీమ్ ‘ఉమెన్ ఇన్ సైన్స్: క్యాటలైజింగ్ విక్సిత్ భారత్’కు అనుగుణంగా విద్యార్థులు శాస్త్ర రంగంలో మహిళల పాత్ర, వారి కృషిని హైలైట్ చేస్తూ ప్రసంగాలు చేశారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పోటీలలో విజేతలైన విద్యార్థులకు సభాధ్యక్షులు డాక్టర్ అడవి రాజు బహుమతులు అందజేశారు. సభలో అధ్యక్షత వహించిన కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అడవి రాజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సైంటిఫిక్ టెంపర్‌ను పెంపొందించుకోవాలని, శాస్త్రీయ ఆలోచనా విధానం సమాజ అభివృద్ధికి అత్యవసరమని పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులు పరస్పర ఆధారితమై ఉన్నందున విద్యార్థులు విభిన్న శాస్త్రాలను సమగ్రంగా అభ్యసించాలని సూచించారు.

భౌతిక శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ హరిత రామన్ ప్రభావం ప్రాముఖ్యతను వివరించి, సి.వి. రామన్ కనుగొన్న ఈ ఆవిష్కరణ భారతదేశానికి గౌరవాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. రసాయన శాస్త్ర పరిశోధనల్లో రామన్ ప్రభావం ఎలా ఉపయోగపడుతుందో రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ స్వాతి వివరించారు.

వృక్షశాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ లలిత మాట్లాడుతూ, నేటి థీమ్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ శాస్త్ర రంగంలో మహిళలు అన్ని విభాగాలలో విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థినులు శాస్త్ర పరిశోధనల వైపు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి జంతుశాస్త్ర అధ్యాపకులు గుణాకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని నడిపించారు. కార్యక్రమంలో డాక్టర్ తుడి వెంకట రెడ్డి, డాక్టర్ జగన్, ఇతర అధ్యపక బృంద విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News