Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:31 PM

మల్బరీ తోటను పరిశీలించిన మంత్రి సవిత

మల్బరీ తోటను పరిశీలించిన మంత్రి సవిత

 మల్బరీ తోటను పరిశీలించిన మంత్రి సవిత
28-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని పరిగి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా మనేసముద్రం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న రైతు చౌడప్పకు చెందిన మల్బరీ తోటను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత రైతుతో మాట్లాడి పంట దిగుబడి, పెట్టుబడి–రాబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మల్బరీ సాగులో ఎదురవుతున్న సమస్యలను కూడా వివరంగా విచారించారు. పట్టు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రైతులకు రోజుకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. అలాగే “అన్నదాత సుఖీభవ” పథకం కింద రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ షెడ్లను సబ్సిడీతో మంజూరు చేస్తున్నామని, సబ్సిడీ ధరలతో ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి రైతు ఈ ప్రభుత్వ సదుపాయాలను వినియోగించు కోవాలని మంత్రి సూచించారు.

Sthanikam

మల్బరీ తోటను పరిశీలించిన మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News