Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

మైనర్లకు పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు

మైనర్లకు పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు

మైనర్లకు పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు
03-03-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాలలో పాఠశాలల పరిధిలో కిరాణా, పాన్ షాపులపై పోలీసుల హెచ్చరిక

నల్గొండ జిల్లాలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చిట్యాల పట్టణ కేంద్రంలో ఉన్న పాఠశాలల సమీప ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.చిట్యాల పట్టణంలోని పాఠశాలల నుండి 100 మీటర్ల పరిధిలో ఉన్న కిరాణా దుకాణాలు, పాన్ షాపుల యజమానులను పోలీసులు అప్రమత్తం చేశారు. మైనర్లకు గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించకూడదని స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ మాట్లాడుతూ, పాఠశాలల పరిసరాల్లో బాలల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల విక్రయంపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పోలీసుల ఈ చర్యలకు పలువురు తల్లిదండ్రులు, స్థానికులు స్వాగతం పలికారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి చర్యలు కొనసాగాలని వారు కోరారు.

Sthanikam

మైనర్లకు పొగాకు విక్రయాలపై కఠిన చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News