Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

మహిళల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది: నిర్మల జగ్గారెడ్డి

19-04-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని బీజేపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నమని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఖండించారు. సంగారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ తొలి నుంచే కట్టుబడి ఉందని, గతంలో మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చి ఆమోదం పొందేలా చేసిన పార్టీ కాంగ్రెస్ేనని గుర్తుచేశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో కలిపి ప్రవేశపెట్టడం వెనుక బీజేపీ రాజకీయ కుట్ర దాగి ఉందని, ఈ అంశాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని విమర్శించారు.పార్లమెంట్‌లో మహిళా బిల్లును వేరుగా ప్రవేశపెడితే కాంగ్రెస్ తప్పకుండా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బీజేపీలో మహిళలకు తగిన ప్రాధాన్యం లేదని, ఇప్పటివరకు ఒక్క మహిళను కూడా ప్రధాని స్థాయికి తీసుకురాలేదని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీని దేశానికి ప్రధాని చేసిన ఘనత కలిగిందని అన్నారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోందని, వారి ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే సమావేశాల్లో మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ, లేదంటే మహిళల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది: నిర్మల జగ్గారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News