Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:04 AM

మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది – నిర్మలా జగ్గారెడ్డి

22-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. బుధవారం కొండాపూర్ మండల పరిధిలోని తేర్పోల్, ఎదురుగుడెం గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలకు ఆమె భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళలను ఆర్థికంగా బలపరిచేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని తెలిపారు.అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం, ఇంద్రమ్మ చీరలు పంపిణీ, మహిళల పేరుపై కొత్త రేషన్ కార్డులు, ఇల్లు లేని వారికి మహిళల పేరుమీదే ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా మాటలకే పరిమితం కాకుండా, పనులతో ప్రజల విశ్వాసం పొందుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సర్పంచ్ సతీష్, కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది – నిర్మలా జగ్గారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News