Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:16 AM

మహిళా సమాఖ్య భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

02-03-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలంలో దుదగోండ గ్రామ పంచాయతీ గట్ లింగంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ మహిళా సమాఖ్య భవన నిర్మాణం సోమవారం ఘనంగా ప్రారంభించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సాధికారత, స్వయం ఉపాధి అభివృద్ధి,సామాజిక-ఆర్థిక పురోగతిని దృష్టిలో ఉంచుకొని ఈ భవనాన్ని రూ.10 లక్షలతో నిర్మించనున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి భూమి పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ:

"గ్రామ మహిళల అభివృద్ధికి ఇది మరో ముఖ్యమైన అడుగు.త్వరలో భవనం పూర్తి చేసి,అందరికీ అందుబాటులోకి తీసుకువస్తాం!" అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, భోజిరెడ్డి – బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బ్రహ్మానంద్ రెడ్డి, శేరి రాజు – మాజీ సర్పంచ్‌లు,శ్రీకాంత్ రెడ్డి, దుధగోండ గ్రామ సర్పంచ్ చోద్ర లీలా, ఉప సర్పంచ్ ప్రతిభ అనిల్ పాటిల్, గ్రామ పెద్దలు దౌలత్ రావు పాటిల్, ధనరాజ్ పాటిల్,వార్డు సభ్యులు, మండల సమాఖ్య బోరంచ క్లస్టర్ సిసి హమ్మండ్ల,గ్రామ సమాఖ్య విఓఏ కవిత,గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామ మహిళలకు సహకారం,సామాజిక-ఆర్థిక సాధికారత,మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంచడానికి మరింతగా దోహదం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

మహిళా సమాఖ్య భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News