Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:15 AM

మహిళా సమైక్య బలోపేతానికి పలు కమిటీల ఏర్పాటు

07-03-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూరు మండల మహిళా సమైక్యలో ఈరోజు సమైక్య బలోపేతం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి వచ్చిన సీనియర్ సిఆర్పీలు హాజరై మండల సమైక్యను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలపై మార్గదర్శకాలు అందించారు.సమైక్య పనులు సక్రమంగా సాగేందుకు మరియు బాధ్యతలను పంచుకునేందుకు పలు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పర్యవేక్షణ కమిటీ,సామాజిక పర్యవేక్షణ కమిటీ,బ్యాంకు లింకేజీ కమిటీ,జీవనోపాధుల కమిటీ మరియు ఆస్తి ధ్రువీకరణ కమిటీలను ఏర్పాటు చేశారు.ప్రతి కమిటీకి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి,సమైక్య కార్యకలాపాలను పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మండల సమైక్యపై ఉన్న బాధ్యతలు ఒక్కరిపై కాకుండా అన్ని సభ్యులపై సమానంగా ఉండేలా ఈ సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కమిటీల ద్వారా గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షించడం,సభ్యులకు అవసరమైన మార్గనిర్దేశం చేయడం మరియు సమైక్యను అన్ని రంగాల్లో బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.సమావేశంలో సామాజిక భద్రత,మహిళల అభివృద్ధి,జీవనోపాధి అవకాశాలు వంటి అంశాలపై కూడా సభ్యులకు అవగాహన కల్పించారు. కమిటీలకు సంబంధించిన విధులు,బాధ్యతలు మరియు నిర్వహణ విధానం గురించి సవివరంగా వివరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిఆర్పీలు వై సాయి లీల,వి చిన్నమ్మ, మండల సమాఖ్య ఏపీఎం అనంతయ్య పాల్గొని కమిటీల సభ్యులకు శిక్షణ ఇచ్చారు.అలాగే మండల సమైక్య అధ్యక్షురాలు,సిబ్బంది మరియు ఇతర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Sthanikam

మహిళా సమైక్య బలోపేతానికి పలు కమిటీల ఏర్పాటు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News