Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:22 AM

మహాశివరాత్రి వేళ కేతకి సంగమేశ్వరుని దర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

16-02-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి దామోదర్ రాజనర్సింహ జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంను భక్తిశ్రద్ధలతో సందర్శించారు. సంగారెడ్డి జిల్లాలోని ఈ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మంత్రిని ఆలయానికి విచ్చేసిన సందర్భంగా అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానించారు. అనంతరం ఆయనను స్వామివారి గర్భగుడికి తీసుకువెళ్లి ప్రత్యేక దర్శనం కల్పించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సుభిక్షం, ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.మంత్రితో పాటు ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కౌన్సిలర్ సభ్యులు,నియోజకవర్గ ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్,కృష్ణారెడ్డి, రామ్ రెడ్డి, మునుపెల్లి అధ్యక్షుడు సతీష్, ధనుంజయ రెడ్డి,మాజీ జెడ్పీ చైర్మన్ సునీత,హనుమంతరావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.మహాశివరాత్రి సందర్భంగా కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు.

Sthanikam

మహాశివరాత్రి వేళ కేతకి సంగమేశ్వరుని దర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News