Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:05 AM

మద్యం తాగుదామని తీసుకెళ్లి హత్య… మెదక్ జిల్లాలో దారుణం

12-03-2026 392 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మెదక్ జిల్లాలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ సంబంధానికి అడ్డుగా మారిందనే కారణంతో ఓ మహిళను ప్రణాళికాబద్ధంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసును దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడుపాక గ్రామానికి చెందిన సులోచన (35) భర్త కొంతకాలం క్రితం మరణించడంతో ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తోంది. జీవనోపాధి కోసం మెదక్ పట్టణానికి వెళ్లి భవన నిర్మాణ పనులు చేస్తుండేది. ఈ క్రమంలో అక్కడ మేస్త్రిగా పనిచేస్తున్న రాజుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది.అయితే అదే సమయంలో రాజుకు బూలీ అనే మరో మహిళతో కూడా సన్నిహిత సంబంధం ఉండేది. ఈ విషయం తెలుసుకున్న సులోచన తరచూ రాజుతో గొడవ పడుతూ ఉండేది. రాజు బూలీతో మాట్లాడటం, కలవడం సులోచనకు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య వివాదాలు పెరిగాయి.దీంతో తమ సంబంధానికి సులోచన అడ్డుగా మారుతోందని భావించిన రాజు, బూలీ కలిసి ఆమెను హత్య చేయాలని కుట్ర పన్నారు.ప్రణాళిక ప్రకారం మార్చి 9వ తేదీన మద్యం తాగుదామని చెప్పి సులోచనను బైక్‌పై తీసుకెళ్లారు.అనంతరం ఏడుపాయల ఆలయం సమీపంలోని చెలిమేకుంట అనే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ముగ్గురూ కలిసి మద్యం సేవించారు.మద్యం మత్తులోకి వెళ్లిన సులోచనపై రాజు, బూలీ కలిసి కర్రతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సులోచన అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనను దొంగల దాడిలా చూపించి తప్పించుకోవాలని ప్రయత్నించారు.అయితే ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, పరిసర ప్రాంతాల సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అనుమానితులను గుర్తించారు. దర్యాప్తు చేపట్టి రాజు, బూలీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Sthanikam

మద్యం తాగుదామని తీసుకెళ్లి హత్య… మెదక్ జిల్లాలో దారుణం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News