Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:35 AM

మద్దతు ఇచ్చి గెలిపించండి

మద్దతు ఇచ్చి గెలిపించండి

మద్దతు ఇచ్చి గెలిపించండి
07-02-2026 220 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

11వ వార్డులో బుట్ట గుర్తుకు ప్రజల మద్దతు కోరిన ఎల్గూరి ఇందిర

సూర్యాపేట (సిటీ): ప్రజలు మద్దతు ఇచ్చి తనను గెలిపిస్తే 11వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అభ్యర్థి ఎల్గూరి ఇందిర తెలిపారు. జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఆమె ప్రజలను నేరుగా కలుసుకుని మద్దతు కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బిఆర్ఎస్, సీపీఎం, టీఆర్‌పీ పార్టీల మద్దతుతో బరిలో ఉన్న తనకు ప్రజలందరూ అండగా నిలిచి బుట్ట గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.వార్డు ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మహిళలు, యువతకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రతి ఇంటి సమస్యకు వెంటనే స్పందించే నాయకత్వం అందిస్తానని హామీ ఇచ్చారు.ఇంటింటి ప్రచారంలో వార్డు ప్రజలు ఆమెకు సానుకూల స్పందన చూపారని, మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతూ ముందుకు రావడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం, ఆశీర్వాదంతో విజయం సాధించి 11వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బుట్ట గుర్తుకు మద్దతు తెలిపారు.

Sthanikam

మద్దతు ఇచ్చి గెలిపించండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News