Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:06 AM

లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోండి: సీఐ వెంకటరెడ్డి

23-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి సీఐ వెంకటరెడ్డి ప్రజలకు లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం మాట్లాడుతూ, ఈ నెల 28న నారాయణఖేడ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు.సిర్గాపూర్, కల్హేర్, కంగ్జి మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమకు సంబంధించిన వివిధ కేసులను సులభంగా పరిష్కరించుకోవాలని కోరారు.లోక్ అదాలత్ ద్వారా యాక్సిడెంట్ కేసులు, గొడవలు, చీటింగ్, చిట్‌ఫండ్ వివాదాలు, చిన్నపాటి దొంగతనాలు, అక్రమ రవాణా వంటి పలు రకాల కేసుల్లో ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చుకునే అవకాశం ఉంటుందని వివరించారు. కోర్టు ప్రక్రియలతో పోలిస్తే, లోక్ అదాలత్‌లో వేగంగా, తక్కువ ఖర్చుతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.అలాగే ఈ నెల 23 నుంచి 28 వరకు సంబంధిత పోలీస్ స్టేషన్లు లేదా కోర్టుకు హాజరై ఇరువర్గాలు పరస్పరం చర్చించి రాజీకి రావచ్చని తెలిపారు. ఇలాంటి అవకాశాల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, పరస్పర విభేదాలు సఖ్యతగా ముగిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రజలు ఈ లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను సులభంగా పరిష్కరించుకోవాలని సీఐ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Sthanikam

లోక్ అదాలత్ అవకాశాన్ని వినియోగించుకోండి: సీఐ వెంకటరెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News