Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

లీప్ యాప్ లోపాలకు ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయొద్దు: చాట్రాయి ఎస్‌టీయూ నాయకుల ఆగ్రహం

02-03-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి, మార్చి 2: ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర విద్యాశాఖ అవలంబిస్తున్న కఠిన వైఖరిని చాట్రాయి మండలం ఎస్‌టీయూ నాయకులు సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్న ‘లీప్’ యాప్‌లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు.

ప్రత్యేకించి గ్రామీణ మండలం అయిన చాట్రాయిలో సిగ్నల్ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ యాప్ పని చేయకపోవడాన్ని ఉపాధ్యాయులపై మోపడం సరికాదని ఆక్షేపించారు. సాంకేతిక లోపాలు, నెట్‌వర్క్ ఇబ్బందులు వంటి కారణాలతో హాజరు నమోదులో జాప్యం జరుగుతున్నదని, దీనిని శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించకుండా ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయడం అన్యాయమన్నారు.

విద్యాశాఖ తీరుతో ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఈ పరిస్థితిని తక్షణమే సరిచేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. లీప్ యాప్ లోపాలను సాంకేతికంగా పరిష్కరించి, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సదుపాయాలు మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రకటనపై చాట్రాయి మండల ఎస్‌టీయూ అధ్యక్షుడు జి. అమరయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. నరసింహారావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి జి. రాము, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.కే. మహబు, జిల్లా అదనపు కార్యదర్శి ఎం. పుల్లారావు, జిల్లా కార్యదర్శి ఏ. విజయ భాస్కర్ సంతకాలు చేశారు.

Sthanikam

లీప్ యాప్ లోపాలకు ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేయొద్దు: చాట్రాయి ఎస్‌టీయూ నాయకుల ఆగ్రహం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News