Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:33 AM

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలు

02-03-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ రఘు అఖిల

భువనగిరి పట్టణ కేంద్రంలో స్టానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా మరియు భావోద్వేగపూర్ణంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలతో తమకు ఉన్న అనుబంధాన్ని మరియు తమ అమూల్యమైన అనుభవాలను హృదయపూర్వకంగా పంచుకున్నారు. చదువు కావాలి అంటే ఏ సంస్థలో అయినా దొరుకుతుంది కానీ విలువలతో కూడిన విజ్ఞానాన్ని ఈ పాఠశాలలో నేర్చుకున్నామని వారు తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ రఘు అఖిల మాట్లాడుతూ... దశాబ్దాలుగా అందిస్తున్న నాణ్యమైన విద్య ఫలితంగా తమ పాఠశాలలో చదివిన ఎందరో విద్యార్థులు IIT, NEET, EAMCET సహా అనేక ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విజయం సాధించారని వెల్లడించారు. ఇంత నాణ్యమైన విద్యను అందించడానికి ఏ రకమైన అదనపు ఫీజు వసూలు చేయలేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఆకర్షణీయమైన కోర్సుల పేర్లతో విద్యార్థులను తప్పుదోవ పట్టించే వ్యాపార సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు గట్టిగా సూచించారు.

పాఠశాల డైరెక్టర్ శ్రీ దీపక్ కుమార్ రఘు 10వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం జీవితంలోని కీలక అంశాలను ప్రస్తావిస్తూ సాగిన ఆ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం విద్యార్థులను,ఉపాధ్యాయులను సమానంగా ప్రేరేపించింది. 13 సంవత్సరాల క్రితం పాఠశాలలో పిల్లల్ని వదలడానికి ఒక తండ్రికి కలిగిన భావోద్వేగం అదే భావోద్వేగం నేటి వీడ్కోలులో తనకు కలుగుతోందని ఆయన హృదయపూర్వకంగా తెలిపారు. తదుపరి ఈ సంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఫిజిక్స్ టీచర్ శ్రీనివాసులు,బయాలజీ టీచర్ సంతోష్ కి అందించబడ్డాయి.ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ వీడ్కోలు సమావేశం విద్యార్థుల జీవితాల్లో చిరస్మరణీయమైన అనుభవంగా నిలిచిపోయింది.

Sthanikam

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News