Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:26 AM

ఖేఢ్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

17-02-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణాఖేడ్ మున్సిపల్ చైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన నాగేష్ కూమార్ షేట్కార్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతిను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ భేటీలో మున్సిపాలిటీ అభివృద్ధి, పట్టణంలోని ప్రాధాన్య సమస్యల పరిష్కారం,మౌలిక వసతుల మెరుగుదల,పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి వంటి ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. ప్రజల ఆశలు,ఆకాంక్షలను నెరవేర్చేందుకు పరిపాలన మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరాన్ని సబ్ కలెక్టర్ ఉమా హారతి సూచించారు. పట్టణ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్ మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శక పాలన అందిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.నారాయణఖేడ్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

Sthanikam

ఖేఢ్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News