Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:21 AM

ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్ అధ్యక్షతన తొలి సమావేశం

18-02-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్ అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కౌన్సిలర్లు పరస్పరం పరిచయాలు చేసుకుని తమ తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను వివరంగా ప్రస్తావించారు. పట్టణాభివృద్ధి, ప్రజా సౌకర్యాల మెరుగుదలపై చర్చలు సాగాయి.ప్రధానంగా ప్రతి వార్డులో తాగునీటి సమస్యపై సమగ్రంగా చర్చించారు.సింగూరు మరమ్మతుల కారణంగా రాబోయే వేసవి కాలంలో నీటి కొరత తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చైర్మన్ సూచించారు.అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగించాలన్నారు.అదేవిధంగా మురుగు కాలువలను శుభ్రంగా ఉంచడం, పట్టణంలో తక్కువ విద్యుత్ ఒత్తిడి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవడం, దేవాలయాలు, మసీదులు, చర్చిల పరిసరాల్లో పరిశుభ్రత పాటించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్‌ను సన్మానించారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది కూడా అభినందనలు తెలియజేశారు. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణాభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

Sthanikam

ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్ అధ్యక్షతన తొలి సమావేశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News