Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:20 AM

ఖేడ్‌లో బీజేపీ ఘన విజయం – 142 ఓట్ల మెజారిటీతో పత్రి లలిత రామకృష్ణ సత్తా చాటారు

14-02-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పత్రి లలిత రామకృష్ణ ఘన విజయం సాధించారు. 1వ వార్డులో జరిగిన పోటీలో ఆయన తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థిపై 142 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం విశేషం. ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీ చివరికి బీజేపీ శ్రేణులకు ఆనందాన్ని తీసుకొచ్చింది.ఈ విజయంతో బీజేపీ నాయకులు,కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఫలితాలు వెల్లడైన వెంటనే పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలిపారు. వార్డు ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన తీర్పుగా ఈ విజయాన్ని పార్టీ నాయకులు అభివర్ణించారు.విజయం అనంతరం స్పందించిన పత్రి లలిత రామకృష్ణ తనపై విశ్వాసం ఉంచి ఓటు వేసిన ప్రతి ఓటరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటానని, 1వ వార్డు సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పారదర్శకంగా పనిచేస్తానని తెలిపారు.ఈ ఫలితం స్థానిక రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలికిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Sthanikam

ఖేడ్‌లో బీజేపీ ఘన విజయం – 142 ఓట్ల మెజారిటీతో పత్రి లలిత రామకృష్ణ సత్తా చాటారు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News