Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:18 AM

ఖేడ్ బాలికల పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా

13-02-2026 173 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవాన్ని అత్యంత ఘనంగా,ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినులే ఉన్నత స్థాయి అధికారులుగా,ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి తమ ప్రతిభను, నాయకత్వ గుణాలను చాటిచెప్పారు. పాఠశాల ప్రాంగణం మొత్తం ఆనందోత్సాహాలతో కళకళలాడింది.ఈ సందర్భంగా వి. కీర్తన ప్రధాన కార్యదర్శిగా, మేవీన్ విద్యాశాఖ మంత్రిగా, మునజ్జ జిల్లా అధికారిగా, సోబియా ప్రాంతీయ సంయుక్త అధికారిగా,చందన ఉప జిల్లా అధికారిగా,జ్ఞానవర్షిత జిల్లా విద్యా అధికారిగా,స్వాతి ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. వివిధ విషయాల ఉపాధ్యాయులుగా కూడా విద్యార్థినులే వ్యవహరించి తరగతులను సమర్థవంతంగా నిర్వహించారు. వారి ఆత్మవిశ్వాసం,సమయపాలన,బాధ్యతాభావం అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖేడ్ పోలీస్ ఉపనిరీక్షకులు శ్రీశైలం గారు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థిని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. నిరంతర కృషి, క్రమశిక్షణ, దృఢ సంకల్పం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమని ప్రేరణాత్మకంగా వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థినులు తమ అనుభూతులను పంచుకుంటూ, స్వపరిపాలన దినోత్సవం ద్వారా బాధ్యతలను ఎలా నిర్వహించాలో, నాయకత్వ లక్షణాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో నేర్చుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామని చెప్పారు.పాఠశాల ఉపాధ్యాయ బృందం సమగ్ర సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. మొత్తం మీద ఈ స్వపరిపాలన దినోత్సవం విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారికి విలువైన అనుభవాన్ని అందించిన స్ఫూర్తిదాయక కార్యక్రనిల

Sthanikam

ఖేడ్ బాలికల పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News