Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:21 AM

ఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి… మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

11-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల మంజూరు కోసం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లు,రహదారులు,డ్రైనేజీలు,తాగునీటి సదుపాయాలు వంటి అంశాల గురించి మంత్రి వారికి ఎమ్మెల్యే వివరించారు.ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని కోరారు.ఎమ్మెల్యే చేసిన వినతిపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందిస్తూ నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన నిధుల మంజూరుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

Sthanikam

ఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి… మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల మంజూరు కోసం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లు,రహదారులు,డ్రైనేజీలు,తాగునీటి సదుపాయాలు వంటి అంశాల గురించి మంత్రి వారికి ఎమ్మెల్యే వివరించారు.ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన నిధులను విడుదల చేయాలని కోరారు.ఎమ్మెల్యే చేసిన వినతిపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందిస్తూ నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన నిధుల మంజూరుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News