Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

కీసరలో లంచం బండారం బట్టబయలు

కీసరలో లంచం బండారం బట్టబయలు

కీసరలో లంచం బండారం బట్టబయలు
01-03-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పోస్టుమార్టం నివేదిక పేరుతో రూ.40 వేలు స్వీకరిస్తూ హోంగార్డ్ అరెస్ట్

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసరలో అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. పోస్టుమార్టం నివేదిక ఇప్పిస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన హోంగార్డ్ నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉచ్చులో వేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, తోటకూరు మహేశ్ నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నివేదిక కోసం అధికారులను సంప్రదిస్తున్న క్రమంలో నగేష్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా నివేదిక త్వరగా అందిస్తానని చెప్పి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తరువాత మృతుడి మేనల్లుడు శరత్‌తో జరిగిన చర్చల్లో రూ.40 వేలకే ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఏసీబీ అధికారులు పన్నిన పథకం ప్రకారం మొదట రూ.5 వేలు స్వీకరించిన నగేష్, రెండో విడతగా రూ.35 వేలు తీసుకుంటుండగా అధికారులు అక్కడికక్కడే పట్టుకున్నారు. స్వీకరించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, నగేష్‌పై అవినీతి నిరోధక చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

పోస్టుమార్టం నివేదిక వంటి సున్నితమైన అంశంలో డబ్బులు డిమాండ్ చేయడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

Sthanikam

కీసరలో లంచం బండారం బట్టబయలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News