Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

కేజీవీబీ జూనియర్ కళాశాల అదనపు భవనానికి రూ.1.60 కోట్లతో భూమిపూజ చేసిన మంత్రి సవిత

02-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలోని కేజీవీబీ కళాశాలలో జూనియర్ కళాశాల అదనపు భవన నిర్మాణానికి రూ.1 కోటి 60 లక్షల నిధులతో ఆమె భూమిపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కరాటేలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన రాంపురం ఎం.జె.పి పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులతో సత్కరించారు. అనంతరం హాస్టల్ వంటగది, తాగునీటి ఆర్వో ప్లాంట్లు, స్టాక్ రిజిస్టర్లను మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని హాస్టల్ నిర్వాహకులకు ఆదేశించారు. భోజనంలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందన్నారు. హాస్టళ్లలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లగా రూ.1.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.

అదేవిధంగా గోరంట్ల కేజీవీపీ డార్మెటరీ నిర్మాణానికి రూ.1 కోటి 60 లక్షలతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. రొద్దం కేజీవీపీకి రూ.69 లక్షలు, సోమందేపల్లి కేజీవీపీకి రూ.1 కోటి 60 లక్షలు కేటాయించామని పేర్కొన్నారు. సోమందేపల్లి మండలంలోని టైప్-4 ల్యాబ్‌లు, గదుల నిర్మాణాన్ని రూ.65 లక్షలతో పూర్తి చేశామని చెప్పారు.

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా రూ.3 కోట్లతో బీసీ హాస్టళ్ల మరమ్మత్తులు చేపట్టినట్లు తెలిపారు. గోరంట్ల ఎస్టీ హాస్టల్‌కు రూ.23 లక్షలు, పెనుకొండ ఎస్టీ హాస్టల్‌కు రూ.26 లక్షలతో మరమ్మత్తు పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ‘నాడు-నేడు’ పేరుతో నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన పనులన్నీ పూర్తి చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Sthanikam

కేజీవీబీ జూనియర్ కళాశాల అదనపు భవనానికి రూ.1.60 కోట్లతో భూమిపూజ చేసిన మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News