Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:35 AM

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

01-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనురాగ్ జయంతి శనివారం పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి పాఠశాల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా డార్మిటరీ, స్టోర్‌రూమ్, కిచెన్, తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని స్వయంగా బాలికలను అడిగి తెలుసుకున్నారు. వంటకు అవసరమైన సరుకులు, సామాగ్రిని పరిశీలించి నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.

9వ మరియు 11వ తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించి, లక్ష్యసాధన కోసం క్రమశిక్షణతో చదువుకోవాలని ప్రోత్సహించారు. తమ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే విద్యనే ప్రధాన ఆయుధంగా భావించాలని బాలికలకు సూచించారు.

పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆయన ఖాళీ ప్రదేశాలను శుభ్రపరచి విద్యార్థినులు ఆటలు ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఇందిరా, పోచంపల్లి ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News