Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:05 AM

కేజీబీవీ న్యాల్కల్ సిఆర్టి అనితకు ఆర్థిక సహాయం అందజేత

16-04-2026 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ కేజీబీవీలో పనిచేసిన భౌతిక శాస్త్ర సిఆర్టి కే. అనిత ఇటీవల మృతిచెందగా, ఆమె కుటుంబానికి టీఎస్ యుటిఎఫ్ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల విరాళాల ద్వారా రూ.1,30,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలోని కేకే భవన్‌లో నిర్వహించిన సంస్మరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్ మాట్లాడుతూ, నైట్ డ్యూటీలో ఉండగా అనిత అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి చికిత్స పొందుతూ మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సహాయం చేయడం అభినందనీయమన్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత లేకపోవడం, కనీస వేతనాలు అందకపోవడం, మరణించినప్పుడు ప్రభుత్వ సహాయం లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేజీబీవీ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, రూ.20 వేల అంత్యక్రియల ఖర్చులు, బేసిక్ పే, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు ఇచ్చి ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు, కేజీబీవీ ఉపాధ్యాయులు మరియు అనిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

కేజీబీవీ న్యాల్కల్ సిఆర్టి అనితకు ఆర్థిక సహాయం అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News