Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో టీఆర్ఎస్ జోష్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి భారీ చేరికలు ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 09:42 AM

కేంద్రం మొండి వైఖరి పై పోరుబాట ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.

కేంద్రం మొండి వైఖరి పై పోరుబాట ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.

కేంద్రం మొండి వైఖరి పై పోరుబాట  ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.
February 03, 2026 04:42 PM 248 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిఐటియు మండల నాయకులు బచ్చలకూర స్వరాజ్యం.

మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కార్మిక సంఘాల ముఖ్య నాయకులు మునగాల మండల సిఐటియు అధ్యక్షులు బచ్చలకూర స్వరాజ్యం, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సోమపంగు జానయ్య కలిసి డాక్టర్ వినయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న చేపట్టబోయే సార్వత్రిక సమ్మెను చారిత్రాత్మక విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పరిశ్రమల సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి తమ నిరసనను గళం వినిపించాలని నాయకులు కోరారు. అలాగే

కేంద్ర ప్రభుత్వ ధోరణిపై తీవ్రంగా మండిపడ్డారు. కార్మికులు దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, యజమానులకు కొమ్ముకాసే విధంగా కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం వల్ల భవిష్యత్తులో కార్మిక భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి ప్రాథమిక అంశాలను కూడా విస్మరించి, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా చట్టాలను సవరిస్తున్నారని విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కార్మికుల ఐక్యత చాటాల్సిన సమయం ఆసన్నమైందని, హక్కుల రక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నేతలు స్పష్టం చేశారు.మునగాల మండల వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ ఫిబ్రవరి 12న విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ వెళ్లి సమ్మె ఆవశ్యకతను వివరిస్తామని, ప్రతి కార్మిక కుటుంబం ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమ్మెను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపాలని, అప్పుడే కార్మికుల ఆకాంక్షలు నెరవేరుతాయని వారు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News