Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన:మంత్రి

22-04-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ నివారణ, అవగాహన కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 దేశాల్లో చేపడుతున్న “వరల్డ్ లార్జెస్ట్ క్యాన్సర్ అవగాహన డ్రైవ్ రన్” కార్యక్రమం గురించి నిర్వాహకులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా అవగాహన పెంపు కోసం రూపొందించిన వాల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.అలాగే “గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్”ను 2026 అక్టోబర్ 11న హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఈ రన్‌లో గచ్చిబౌలి స్టేడియంలో సుమారు 35 వేల మంది పాల్గొనగా, ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో దాదాపు 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారని నిర్వాహకులు వెల్లడించారు. క్యాన్సర్ అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమాలను మంత్రి అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ, అవగాహనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు, కీమోథెరపీ సేవలను అందుబాటులో ఉంచామని చెప్పారు. క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎం.ఎన్.జే క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, నిమ్స్ ఆసుపత్రుల్లో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రేస్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, యశోద ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్ సాయి కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్యాన్సర్‌పై అవగాహన పెంపు కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన:మంత్రి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News