Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

కార్మికుల పక్షాన బీజేపీ – నిరసనకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

24-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని ఆర్‌టీసీ డిపో వద్ద గత మూడు రోజులుగా ఆర్టీసీ కార్మిక సోదర సోదరీమణులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ తరపున సంఘీభావం తెలిపినట్లు మాజీ శాసన సభ్యులు విజయపాల్ రెడ్డి తెలిపారు.తెలంగాణ సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని గుర్తుచేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులు నేడు తమ హక్కుల కోసం నిరసనకు దిగాల్సి రావడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఆర్‌టీసీ కార్మికుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారికి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న ఆర్‌టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుందని తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.

Sthanikam

కార్మికుల పక్షాన బీజేపీ – నిరసనకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News