Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

కార్మిక హక్కుల కోసం పోరాటం – సీఐటీయూ చుక్క గుర్తుపై ఓటు వేయండి

24-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలోని ఎంఆర్ఎఫ్ అంకనపల్లి పరిశ్రమలో యూనియన్ గుర్తింపు వెరిఫికేషన్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించగా, రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో కార్మిక హక్కులు, సంక్షేమం కోసం నిజంగా పోరాడుతున్న సంఘం సీఐటీయూనేనని ఆయన తెలిపారు. గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని సంఘాలు కార్మికులను నిరాశపరిచాయని విమర్శించారు. సీఐటీయూ సమిష్టి నాయకత్వంతో కార్మికులకు చారిత్రాత్మక వేతన ఒప్పందం, మెరుగైన సౌకర్యాలు, ఉద్యోగ భద్రత సాధించగలదని పేర్కొన్నారు.యజమాన్యం ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలను కార్మికుల ఐక్యతతో ఎదుర్కొన్నామని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ప్రతి కార్మిక సంఘానికి హక్కు అని అన్నారు. కార్మిక సంఘాల ఎన్నికల్లో యాజమాన్యం జోక్యం తగదని స్పష్టం చేశారు. రేపు జరిగే ఎన్నికల్లో సీఐటీయూ గుర్తు “చుక్క”పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీర మల్లేశం, జే మల్లికార్జున్, వి ప్రవీణ్ కుమార్, సాయిలు, మాణిక్యం, రాజయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కార్మిక హక్కుల కోసం పోరాటం – సీఐటీయూ చుక్క గుర్తుపై ఓటు వేయండి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News