Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:03 AM

కాన్షీరాం ఆశయాలతో బహుజన సమాజం ముందుకు సాగాలి

15-03-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బహుజన ఉద్యమ పితామహుడు మన్యశ్రీ కాన్షీరాం జయంతి సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షులు అనుముల తుకారం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బోర్గి భీమన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బహుజన సమాజం దేశంలో పెద్ద శాతం ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయ అధికారాన్ని సాధించలేకపోతున్న పరిస్థితి ఉందన్నారు. బహుజనులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడితేనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహనీయుడు కాన్షీరాం చూపిన మార్గంలో నడుస్తూ బహుజన సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కాన్షీరాం తన జీవితాన్ని మొత్తం బహుజనుల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం అంకితం చేసిన మహనీయుడని నాయకులు కొనియాడారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. బహుజన సమాజం ఐక్యంగా ఉంటేనే సమాజంలో సమానత్వం మరియు న్యాయం స్థిరపడుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నారాయణఖేడ్ ఉపాధ్యక్షులు మైత్రి సాయిలు, అంబేద్కర్ భవనం ఇంచార్జ్ బీమాసేన, దళిత నాయకులు ప్రదీప్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ తదితర నాయకులు, కార్యకర్తలు మరియు బహుజన సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Sthanikam

కాన్షీరాం ఆశయాలతో బహుజన సమాజం ముందుకు సాగాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News