Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

కన్నుల పండుగగా శ్రీ తిరుమలనాథ స్వామి రథోత్సవం

27-02-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెద్దకాపర్తి గుట్టపై భక్తి పారవశ్యం… భారీగా తరలివచ్చిన భక్తులు

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించే శ్రీ తిరుమలనాథ స్వామి జాతరలో భాగంగా శుక్రవారం గుట్టపై నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. గ్రామ దేవస్థాన పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి. స్వామివారి రథాన్ని గ్రామ పెద్దలు, యువకులు భక్తి శ్రద్ధలతో లాగుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద మంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైన రథోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు.జాతర విజయవంతానికి సహకరించిన దాతలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ ఓర్సు రాజు, సర్పంచ్ కాటం వెంకటేష్, మాజీ సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి, చేకూరి గణేష్, నీలకంఠం లింగస్వామి, ఆవుల జానయ్య, నీలకంఠ నరేష్, ఆవుల రాము, మోర రామరాజు, ఏర్పుల నరసింహ, నూతి తిరుమలేష్, ఎదుల అజిత్ రెడ్డి, ఆనగంటి నరేష్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.మూడు రోజులపాటు జరుగనున్న జాతరలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని పెద్దలు అభిప్రాయపడ్డారు.

Sthanikam

కన్నుల పండుగగా శ్రీ తిరుమలనాథ స్వామి రథోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News