Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:13 AM

కాలనీల్లో కలెక్టర్ పర్యటన – ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టమైన అవగాహన

10-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసి పరిధిలోని ఆర్సిపురం మండలం మార్క్స్ నగర్, ఇక్రిశాట్ కాలనీలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హౌసింగ్ అధికారులతో కలిసి పర్యటించి కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పిస్తూ, జీ ప్లస్ 5 విధానంలో ఆధునిక సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కాలనీవాసులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్సిపురం తహసీల్దార్, హౌసింగ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

కాలనీల్లో కలెక్టర్ పర్యటన – ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టమైన అవగాహన

Article Image

సంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసి పరిధిలోని ఆర్సిపురం మండలం మార్క్స్ నగర్, ఇక్రిశాట్ కాలనీలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హౌసింగ్ అధికారులతో కలిసి పర్యటించి కాలనీవాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పిస్తూ, జీ ప్లస్ 5 విధానంలో ఆధునిక సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కాలనీవాసులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్సిపురం తహసీల్దార్, హౌసింగ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News