Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

కల్హేర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష

16-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కల్హేర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మండలానికి చెందిన సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్, వ్యవసాయం, గ్రామీణ తాగునీటి సరఫరా, విద్య, స్వయం సహాయక సంఘాల శాఖల అధికారులు హాజరయ్యారు. గ్రామాల్లో అమలవుతున్న పథకాల పురోగతి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి అర్హుడికి పథకాల లబ్ధి అందేలా కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, వ్యవసాయ సమస్యలను వెంటనే గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేద కుటుంబాలకు మేలు చేకూరేలా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలని, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

కల్హేర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News