Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:38 AM

కక్కిరేణి పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

కక్కిరేణి పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

కక్కిరేణి పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం
28-02-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఫిబ్రవరి 28: మండలంలోని కక్కిరేణి గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు వినూత్నంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ హోదాల్లో విద్యార్థులు బాధ్యతలు చేపట్టి నిర్వహించిన కార్యక్రమం గ్రామ ప్రజలను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. ఉపేందర్ జి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, పరిపాలనా అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.

అంకిరెడ్డి జశ్విక విద్యాశాఖ మంత్రిగా, కన్నెబోయిన లిఖిత ముఖ్య కార్యదర్శిగా, చిల్లా యోగిత కలెక్టరుగా, చిల్లా రాకేష్ ఎమ్మెల్యేగా, నడిగోటి తనుస్వి జిల్లా విద్యాధికారిగా, రియన్ ఎంఈఓగా, శుష్మ ఎంఆర్ఓగా, మైథిలి ఎంపీడీఓగా, బుర్ర అక్షిత హెచ్ఎంగా వ్యవహరించారు.

విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి అనంతరం పాఠశాలలో తరగతులను సందర్శించారు. విద్యార్థుల పనితీరును గ్రామస్థులు అభినందించారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి. గణేష్, పి. గోపాల్ రెడ్డి, కృష్ణ, స్వర్ణలత, ప్రశాంతి పాల్గొన్నారు. ఎస్ఎంసి చైర్మన్ చిల్లా హేమలత మురళీకృష్ణ, పిట్ట రాం రెడ్డి, వేముల సైదులు, చిల్లా భవాని, మధు, కావ్య వెంకట్, కమలాకర్, ప్రమీల, సంధ్య, ధనమ్మ, సుభద్ర తదితరులు హాజరయ్యారు.

Sthanikam

కక్కిరేణి పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News