Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:25 AM

కాంగ్రెస్ పార్టీ విజేత అభ్యర్థులకు ఘన సన్మానించిన:ఖేడ్ ఎమ్మెల్యే

13-02-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్యే స్వగృహంలో శుక్రవారం నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజేతలకు శాలువాలు కప్పి,పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు.ఈ ఎన్నికల్లో మొత్తం 15 స్థానాలకు గాను 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ద్వారా నారాయణఖేడ్ పట్టణంలో మరోసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బలమైన మద్దతు ఇచ్చినట్లు స్పష్టమైంది. ప్రజలు చూపిన విశ్వాసం, అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఈ విజయం ప్రజల విజయం అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన అభ్యర్థులు:

2వ వార్డు – సురేఖ విట్టల్

4వ వార్డు – దారం శంకర్ సెట్

5వ వార్డు – మహేష్ చౌహాన్

6వ వార్డు – భగవాన్ లక్ష్మణ్

8వ వార్డు – నగేష్ కుమార్ షేట్కార్

9వ వార్డు – బాణాపురం రాజు

10వ వార్డు – ఫర్హానా బేగం

11వ వార్డు – రుక్మిణి గోపాల్ రెడ్డి

12వ వార్డు – షారుఖాన్

13వ వార్డు – మహేందర్కార్ వివేకానంద

14వ వార్డు – అజియా తరుణ్నం

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, నారాయణఖేడ్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. మౌలిక వసతులు,తాగునీరు, రహదారులు,పారిశుధ్యం,విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.పట్టణ అభివృద్ధి కోసం ప్రతి వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉండి సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేసిన కష్టానికి ఫలితమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజేత అభ్యర్థులను అభినందించారు.నారాయణఖేడ్ అభివృద్ధికి ఇదే ఆరంభమని,ప్రజల ఆశలకు తగ్గ విధంగా పని చేస్తామని స్పష్టం చేశారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీ విజేత అభ్యర్థులకు ఘన సన్మానించిన:ఖేడ్ ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News