Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:49 PM

జాతీయ సమైక్యతా శిబిరానికి తారా కళాశాల విద్యార్థిని ఎంపిక

జాతీయ సమైక్యతా శిబిరానికి తారా కళాశాల విద్యార్థిని ఎంపిక

జాతీయ సమైక్యతా శిబిరానికి తారా కళాశాల విద్యార్థిని ఎంపిక
March 15, 2026 12:39 PM 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా శిబిరానికి తారా కళాశాలకు చెందిన విద్యార్థిని గీత బి.ఏ ద్వితీయ సంవత్సరం ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ లో ఉన్న కర్ణాటక విశ్వవిద్యాలయంలో ఈ నెల 11 నుండి 17వ తేదీ వరకు ఈ శిబిరం నిర్వహిస్తున్నారు.దేశంలోని యువతలో జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి, భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప భారతీయ సాంప్రదాయాన్ని బలపరచడానికి కేంద్ర ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఈ తరహా జాతీయ సమైక్యతా శిబిరాలను నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకుని తమ తమ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, ఆచార వ్యవహారాలను పరిచయం చేసుకుంటూ పరస్పర అవగాహన పెంపొందించుకోవడం ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం నుండి ధార్వాడ్ లో జరుగుతున్న ఈ శిబిరానికి పదిమంది జాతీయ సేవా పథకం స్వచ్ఛంద కార్యకర్తల బృందం బయలుదేరిందని తెలిపారు. అందులో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని, వారిలో తారా కళాశాలకు చెందిన గీత బి.ఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఉండడం తమ కళాశాలకు గర్వకారణమని చెప్పారు.ఈ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శిస్తూ తెలంగాణకు మంచి గుర్తింపును తీసుకువస్తున్నారని తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించే సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాలను కూడా తెలుసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా యువతలో జాతీయ సమైక్యత భావన పెంపొందుతూ తామంతా ఒకే దేశానికి చెందిన భారతీయులమనే ఆత్మీయ భావన బలపడుతుందని తెలిపారు.దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరస్పరం పంచుకోవడం ద్వారా భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తంగా పరిచయం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.తమ కళాశాల విద్యార్థిని ఈ జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపిక చేసినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం అధ్యక్షుడు కుమార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం సమన్వయకర్త ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల జాతీయ సేవా పథకం అధికారులు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News