Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

జనార్ధనవరం గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభం

02-03-2026 224 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి కీలక అడుగు పడింది. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు, మెటల్ రోడ్డు పనులకు రూ.20 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని జనార్ధనవరం గ్రామ టిడిపి అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో చాట్రాయి మండల టిడిపి మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, గ్రామ టిడిపి ఉపాధ్యక్షుడు పామర్తి నాగరాజు, గ్రామ టిడిపి కార్యదర్శి బలువురు రత్తయ్య, కాళంగి గోపాలరావు, బూత్ ఇంచార్జ్ కొనకాల చెన్నారావు, చాట్రాయి మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు బొద్దు వెంకటేశ్వరరావు, మాదిరాజు ప్రసాదు, బొరిగొర్ల తిరుపతిరావు, నడిపింటి వెంకటేశ్వరరావు, పులపాక రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడంతో పాటు సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కి జనార్ధనవరం గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామంలో ఈ అభివృద్ధి పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యం కలగనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

జనార్ధనవరం గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News