Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:18 AM

జన్మదిన సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

07-03-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై పండరి

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ది మండల కేంద్రంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పదో తరగతి చదువుతున్న 35 మంది విద్యార్థులకు పరీక్షల సమయంలో అవసరమైన పెన్నులు,పెన్సిల్లు,స్కేలు,హాల్ టికెట్ కవర్లు,చాపమార్లు పంపిణీ చేశారు.విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా రాయాలని, క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సహాయం అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు సాధించవచ్చని చెప్పారు.ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, కాశీరాం, విజేందర్ రెడ్డి, మారుతి జ్యోతి, మల్లేశ్వరి మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ ఇంచార్జ్ భీమా సేన, కేవీపీఎస్ మండల నాయకుడు గణపతి, వార్డ్ సభ్యుడు తుకారం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని పాల్గొన్న వారు తెలిపారు.

Sthanikam

జన్మదిన సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News