Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

జమ్మాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జమ్మాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జమ్మాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
02-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మహిళా భవన్‌కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించడంతో పాటు నూతనంగా నిర్మించనున్న మహిళా భవన్‌కు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ప్రాధాన్యమని,మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల సాధికారతకు మహిళా భవన్ వేదికగా మారుతుందని, స్వయం సహాయక సంఘాల సమావేశాలు,శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నుర్ధరాజ్ స్వరూప,ఉపసర్పంచ్,వార్డు సభ్యులు, రాష్ట్ర నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్,మండల అధ్యక్షుడు కృష్ణ రెడ్డి, తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి,కొండల్ రెడ్డి,బెండే శ్రీకాంత్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

జమ్మాపురంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News