Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:07 AM

జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తేనే కుటుంబాలు సురక్షితం

13-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాయికోడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగాపూర్ గ్రామంలో రాయికోడ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులు, మృతుల కుటుంబ సభ్యులు పాల్గొని తమ అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు గ్రామస్తులతో పంచుకున్నారు. వారి మాటలు ప్రజలను ఆలోచింపజేసి రోడ్డు భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం, అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి, జాగ్రత్తగా వాహనం నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగితే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువత, మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తేనే కుటుంబాలు సురక్షితం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News