Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:07 AM

ఇంటికి వెళ్లే దారి మూసివేత… న్యాయం కోసం సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించిన పరశురాం

12-03-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అధికారులు తన ఇంటికి వెళ్లే రహదారి సమస్యను పరిష్కరించకపోతే ఉరితాడే శరణ్యమని గ్రామస్తుడు పరశురాం ఆవేదన వ్యక్తం చేశారు.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం జ్యోవాలా తాండ గ్రామ పరిధిలో ఈ సమస్య నెలకొంది.బీమార్మి సంఘం అధ్యక్షులు అనుముల తుకారం ఆధ్వర్యంలో పరశురాం తరఫున సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జ్యోవాలా తాండ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 42లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, పరశురాం ఇంటికి వెళ్లేందుకు సరైన రహదారి కల్పించాలని వారు అధికారులను కోరారు.ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ తాను గతంలో పలుమార్లు మండల అభివృద్ధి అధికారి మరియు గ్రామ సెక్రటరీలకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.సుమారు 35 సంవత్సరాల క్రితం గ్రామ ప్రజల రాకపోకల సౌకర్యం కోసం 18 మీటర్ల వెడల్పుతో పంచాయతీ రహదారి కోసం భూమిని వదిలి పెట్టారని గ్రామస్తులు తెలిపారు. అయితే మాజీ సర్పంచ్ చరణ్ నాయక్ ఆ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ఇప్పటికే రహదారి భూమిలో సుమారు 10.5 మీటర్ల వరకు ఆక్రమణ జరిగిందని వారు తెలిపారు.ఈ అక్రమ నిర్మాణాల వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పరశురాం ఇంటికి వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే రహదారిని ఆక్రమించడం సరైన చర్య కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారులు వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలను నిలిపివేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీమార్మి సంఘం అధ్యక్షులు అనుముల తుకారం డిమాండ్ చేశారు. పరశురాం ఇంటికి వెళ్లే దారిని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ, లేనిపక్షంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు దీక్ష చేపడతామని హెచ్చరించారు.అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Sthanikam

ఇంటికి వెళ్లే దారి మూసివేత… న్యాయం కోసం సబ్ కలెక్టర్‌ను ఆశ్రయించిన పరశురాం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News