Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళలకు చట్ట అవగాహన – సమాజ మార్పుకు తొలి అడుగు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 07:57 PM

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ దాడులను ఖండించాలి ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ధర్నా

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ దాడులను ఖండించాలి ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ధర్నా

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ దాడులను ఖండించాలి ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ధర్నా
March 03, 2026 01:36 AM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు : ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ దాడులను ఖండించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ హాజరయ్యారు. జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ మాట్లాడుతూ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాద విధానాలతో ఇరాన్‌పై సైనిక దాడులకు పాల్పడటం దారుణమని విమర్శించారు. ఇరాన్ దేశాధ్యక్షుడు ఆలీ కామినేని మరియు వారి కుటుంబ సభ్యులపై జరిగిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. యుద్ధం వద్దు, ప్రపంచానికి శాంతి కావాలని కోరారు.

రాష్ట్ర కార్యదర్శి బంగారరావు మాట్లాడుతూ, వెనిజులా అధ్యక్షుడు నికోలస్మా మాదురో గతంలో అమెరికా తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. 2003లో ఇరాక్‌లో ఆయుధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్ ను హతమార్చడం అమెరికా దురహంకారానికి నిదర్శనమని విమర్శించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా యుద్ధోన్మాద చర్యలను తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు.

ఇదే సందర్భంలో జిల్లాలోని భూసంబంధిత సమస్యలపై కూడా నేతలు స్పందించారు. నూజివీడు రెవెన్యూ డివిజన్‌లోని చాట్రాయి, ముసునూరు మండలాలలో మూడు తరాలుగా సాగు చేస్తున్న అటవీ భూములపై జారీ చేసిన 4 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీ గ్రాంజీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను కొనసాగించాలని, పని దినాలను 200 రోజులకు పెంచి రోజుకు కనీస వేతనం రూ.600 చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆశ, అంగన్‌వాడి, మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేసి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నెలకు కనీస వేతనం రూ.36,000 చెల్లించాలని కోరారు. తమ్మిలేరు వద్ద గుల్లపూడి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, సీగుడిపాడు గ్రామంలో అన్యాక్రాంతమైన సీలింగ్ మిగులు భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

చీపురుగూడెం పంచాయతీలో 553/1 సర్వే నంబరు భూమి ఫారెస్ట్‌గా నమోదు కాలేదని, సాగు చేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. మంగపేట శివారు తుమ్మలపల్లెగూడెంలో ఇళ్లు వేసుకున్న పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, తమ్మిలేరు రిజర్వాయర్ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని పేదలకు పంచాలని దుర్గం పుల్లారావు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వేముల బక్కయ్య, చాట్ల బాబురావు, సర్వేసు, దుర్గం పూజిత, భవాని, నందిపాము రాణి, జోషి, పామర్తి రామారావు, కళావతి మారయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News