Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:04 AM

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

17-03-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని రెహమాన్ కార్యక్రమ మందిరంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమ హారతి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఉపవాస విరమణ చేశారు. అనంతరం అందరితో కలిసి భోజనం చేసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.రంజాన్ మాసం పరస్పర గౌరవం, సోదరభావం, సఖ్యతను పెంపొందించే పవిత్రమైన కాలమని తెలిపారు.ఈ పవిత్రమైన రంజాన్ మాసం ప్రజల మధ్య ఐక్యతను బలపరచాలని, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొనాలని ఆకాంక్షించారు. మత భేదాలు లేకుండా హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ కలిసికట్టుగా జీవిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. రంజాన్ పండుగ అందరికీ శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, మైనారిటీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News