Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:03 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ

11-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. భవాని చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన మహిళా దినోత్సవ భావం “ఇవ్వడం ద్వారా అభివృద్ధి” అనే సందేశంతో నిర్వహించబడింది.మహిళలు సమాజ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళల సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మహిళలకు గౌరవం, భద్రత మరియు సమాన హక్కులు కల్పించడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ వ్యవస్థకు చెందిన పలువురు న్యాయమూర్తులు మరియు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. భవాని చంద్ర, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. జయంతి, జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి కృష్ణార్జున, ఫోక్సో కోర్టు న్యాయమూర్తి శ్రీలేఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య, ప్రధాన జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఆర్. అనిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి కె. ధనలక్ష్మి పాల్గొన్నారు.అదేవిధంగా కోర్టు మహిళా సిబ్బంది,కోర్టు అధికారులు మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. మహిళల అభివృద్ధి, సమానత్వం మరియు సాధికారతకు అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Sthanikam

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News