Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: హౌసింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం

25-04-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు ఆలస్యం లేకుండా అందేలా చూడాలని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హౌసింగ్ అధికారులను ఆదేశించారు. నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల హౌసింగ్ ఏఈలు, డిఈలు మరియు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను తక్షణమే క్లియర్ చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూసి బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ హౌసింగ్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: హౌసింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News