Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:06 AM

హెడ్ కానిస్టేబుల్ మరణం పోలీసు శాఖకు తీరని లోటు: ఎస్పీ

25-04-2026 545 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మాసాని వెంకటరాములు అంత్యక్రియలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ నారాయణఖేడ్ పట్టణంలో హాజరై మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధను పంచుకుని అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వెంకటరాములకు రావలసిన అన్ని రకాల సేవా ప్రయోజనాలు మరియు ఆర్థిక సహాయాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటరాములు ఈ నెల 23న నారాయణఖేడ్ నుండి జహీరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా న్యాల్కల్ మండలం చాల్కి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. వెంకటరాములు మరణం జిల్లా పోలీసు శాఖకు తీరని లోటని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్, నారాయణఖేడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం, పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

హెడ్ కానిస్టేబుల్ మరణం పోలీసు శాఖకు తీరని లోటు: ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News