Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:09 AM

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

16-03-2026 304 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల పరిధిలో సోమవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్ గ్రామం నుంచి నల్లంపల్లి గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్ల లేదా వాహనం నియంత్రణ కోల్పోయి స్వయంగా స్కిడ్ కావడం వల్ల ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతని వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని,గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా లేదా వాహనం జారి పడటం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.

Sthanikam

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Article Image

అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండల పరిధిలో సోమవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. మాదాపూర్ గ్రామం నుంచి నల్లంపల్లి గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్ల లేదా వాహనం నియంత్రణ కోల్పోయి స్వయంగా స్కిడ్ కావడం వల్ల ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతని వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని,గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా లేదా వాహనం జారి పడటం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News