Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:11 PM

ఘనంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని సత్కరించిన కాలనీవాసులు

01-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని ఆంధ్ర బ్యాంక్ ఎంక్లేవ్ ఫేస్–1 కాలనీవాసులు తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డిను ఘనంగా సన్మానించారు. గజమాల, శాలువాతో సత్కరించి తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని కొనియాడారు.

నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రేమాభిమానాలే తనకు బలం అని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.

కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నగేష్, సంక్షేమ సంఘం సభ్యులు వెంకటేష్, రాజు, రవి, నర్సింగ్ రావు, జంగయ్య, రెడమ్మా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా కళ్లెం నవజీవన్ రెడ్డి ని సత్కరించిన కాలనీవాసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News