Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

గ్రీన్ గ్రోవ్ స్కూల్ లో ఘనంగా పదో తరగతి ఫేర్‌వెల్

02-03-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ గ్రీన్ గ్రోవ్ స్కూల్ లో పదో తరగతి విద్యార్థుల ఫేర్‌వెల్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఆనందం–ఆవేశాల మేళవింపుగా నిలిచింది. ముఖ్య అతిథులుగా దారావత్ సూర్యం (ఎస్‌బిఐ ఎస్సీ, ఎస్టీ అధ్యక్షులు), జితేందర్ రెడ్డి (తెలంగాణ టీవీ కేబుల్ జేఏసీ ప్రెసిడెంట్) హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు అందించారు. “కష్టపడితే అసాధ్యం ఏదీ లేదు. లక్ష్యసాధనకు పట్టుదలతో ముందుకు సాగాలి” అని దారావత్ సూర్యం పేర్కొన్నారు. యువతే దేశ భవిష్యత్తని, నైతిక విలువలను పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని జితేందర్ రెడ్డి సూచించారు. అధ్యక్షత వహించిన వీణ అనీల్ రెడ్డి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో క్రమశిక్షణగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పాఠశాల డైరెక్టర్ లక్ష్మి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారి విజయాలను పాఠశాల ఎల్లప్పుడూ గర్వంగా స్వాగతిస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకోగా, ఉపాధ్యాయులు జ్ఞాపికలు అందజేసి ఆశీర్వదించారు. చివరగా విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగంగా వీడ్కోలు పలికారు.

Sthanikam

గ్రీన్ గ్రోవ్ స్కూల్ లో ఘనంగా పదో తరగతి ఫేర్‌వెల్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News