Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరెగూడెంలో ఉపాధి హామీ పనులకు శ్రీకారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 10:41 AM

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా పాలన కార్యక్రమాలు

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా పాలన కార్యక్రమాలు

గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా పాలన కార్యక్రమాలు
March 06, 2026 02:45 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన అధికారులతో మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి,నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణపై అధికారులతో సమగ్రంగా చర్చించి దిశానిర్దేశం చేశారు.మార్చి 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు మొత్తం 99 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రజలకు మరింత సమీపంగా ప్రభుత్వ సేవలను అందించడంతో పాటు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఏప్రిల్ 2వ తేదీన గ్రామస్థాయిలో గ్రామసభలు నిర్వహించడం, ఏప్రిల్ 16వ తేదీన మండల స్థాయి కార్యక్రమాలు, మే 2వ తేదీన నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, మే 22వ తేదీన జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు.ఈ 99 రోజుల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పలు ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రతను పెంపొందించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వేగంగా క్లియర్ చేయడం, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం, రోడ్డు భద్రతకు సంబంధించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని అమలు చేయడం, సంక్షేమ పథకాల అమలును సమర్థవంతంగా కొనసాగించడం వంటి అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి.అలాగే పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, యువతను డ్రగ్స్ వంటి ప్రమాదకర అలవాట్ల నుండి దూరంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడం, రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ అభివృద్ధికి చర్యలు చేపట్టడం, విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడం, యువతలో క్రీడలను ప్రోత్సహించడం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వడం, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం వంటి మొత్తం 10 ప్రధాన అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమాలు ప్రతి గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో అమలు కావాలని, అన్ని శాఖల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు సమిష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News